News May 15, 2024
త్వరలోనే APలో బంగారం ఉత్పత్తి
AP: కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం గనిలో 2024 చివరికల్లా బంగారం ఉత్పత్తి మొదలవనున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ఇదే తొలి ప్రైవేటు బంగారు గని. దీని కోసం జెమైర్‌సోర్ సర్వీసెస్ కంపెనీ ఇప్పటికే 250ఎకరాల భూసేకరణ చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు 60%పూర్తయినట్లు సమాచారం. ఇది ప్రారంభమైతే ఏటా 750కిలోల బంగారం ఉత్పత్తవుతుందని అంచనా. దీనిపై ఇప్పటి వరకు రూ.200కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ తెలిపింది.
Similar News
News January 11, 2025
నేడు పులివెందులకు వైఎస్ జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం YS జగన్ ఇవాళ పులివెందుల వెళ్లనున్నారు. YCP వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డా.YS అభిషేక్ రెడ్డి(36) అంత్యక్రియలకు హాజరు కానున్నారు. పులివెందులలోని YS కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి. జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే.
News January 11, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
News January 11, 2025
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై వాహనాలకు పర్మిషన్
AP: HYD నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్. VJA వెస్ట్ బైపాస్‌పై శుక్రవారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చారు. గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు 30KM బైపాస్ నిర్మాణం 90% పూర్తి కాగా వాహనాలను అనుమతించట్లేదు. సంక్రాంతి రద్దీ సందర్భంగా 2 వైపులా రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. నగరంలోకి ప్రవేశించకుండా బైపాస్ మీద వెళ్తుండటంతో గంటకు పైగా సమయం ఆదా అవుతోంది.