News May 15, 2024
ఆదిలాబాద్: 12,21,563 మంది ఓటేశారు!

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 16,50,175 మంది ఓటర్లు ఉండగా.. 12,21,563 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 74.03 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 71.42 శాతంతో పోల్చుకుంటే దాదాపు రెండున్నరశాతం అధికమే. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.
Similar News
News March 4, 2026
ఉట్నూర్: జీసీసీకి నిధులు మంజూరయ్యేనా..?

ఉమ్మడి ADBలోని 41 కొత్త డీఆర్ డిపోల నిర్మాణానికి రూ.8.20 కోట్లు, 21 డీఆర్ డిపోల మరమ్మతులకు రూ.కోటి, డివిజన్ ఆఫీస్‌ల మరమ్మతులకు రూ.10 లక్షలు, కాగజ్‌నగర్, జన్నారం ఆసిఫాబాద్‌లో ఆఫీస్‌ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, అటవీ ఉత్పత్తుల సేకరణకు రూ.2.10 కోట్లు నిధులు అవసరం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గీక్ ఛైర్మన్ తిరుపతికి ఇటీవల కలిసి జీసీసీ డీఎం సందీప్ కుమార్ విన్నవించారు. మరి నిధులు మంజూరయ్యేనా చూడాలి.
News March 3, 2026
హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

హోలీని శాంతియుతంగా, స్వీయ భద్రతా జాగ్రత్తలతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు వీలైనంత వరకు సహజసిద్ధమైన రంగులనే వాడాలని కోరారు. యువత, చిన్నారులు ఉత్సాహంలో వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఈత రాని వారు నీటిలోకి వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
News March 2, 2026
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ADB SP

హోలీ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎవరిపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. ఈత రానివారు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


