News May 15, 2024

మరో కీలక ఎన్నికకు నల్గొండ సిద్ధం

image

లోక్‌సభ పోరు ముగియగా మరో సమరానికి నల్గొండ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్‌గా అశోక్ పోటీ చేస్తున్నారు.

Similar News

News March 14, 2026

NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

image

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

మిర్యాలగూడ: వాగులో పడి రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తడకమళ్లకి చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.

News March 14, 2026

పుకార్లు నమ్మొద్దు.. మోసపోవద్దు: నల్గొండ కలెక్టర్

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్గొండ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకదనే పుకార్లను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని 33 ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసిన 4 నుంచి 5 రోజుల్లోపు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల వద్ద 8118 సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు.