News May 15, 2024
ఏపీలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గం ఇదే..

ఏపీలో అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ రికార్డు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% పోలింగ్ నమోదు అయింది.
Similar News
News March 16, 2026
NZB: సమయపాలన పాటించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు సమయపాలన పాటించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. సోమవారం ప్రజావాణిలో 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.
News March 16, 2026
వరుస సెలవులు.. ప్రత్యేక బస్సులు

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం ఉగాది, శనివారం రంజాన్ సెలవు దినాలు కావడంతో.. శుక్రవారం ఒక్కరోజు లీవ్ పెడితే ఆదివారంతో కలిపి వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. ఇక పండుగ రద్దీ దృష్ట్యా 17, 18వ తేదీల్లో TGSRTC ప్రత్యేక బస్సులు(స్పెషల్ ఛార్జీలు వర్తిస్తాయి) నడపనున్నట్లు ప్రకటించింది.
News March 16, 2026
‘పద్మ వ్యూహం’ నిర్మాణం ఎలా ఉంటుందంటే?

బయటపడలేని సమస్యల్లో ఉన్నప్పుడు ‘పద్మవ్యూహం’లో ఇరుక్కుపోయారని అంటారు. భారతంలో ద్రోణాచార్యుడు పన్నిన శత్రు దుర్భేద్యమైన యుద్ధ నిర్మాణమే పద్మవ్యూహం. తామరపువ్వు ఆకారంలో 7 వలయాల్లో రథ, గజ, అశ్వ, పదాతి సైన్యాలతో ఉంటుంది. ఇందులోకి వెళ్లిన అభిమన్యుడు తనువు చాలించారు. దీన్ని ఛేదించగలిగేది కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు మాత్రమే.
<<-se>>#EPICSAYINGS<<>>


