News May 15, 2024
హైదరాబాద్‌లో ఫలించిన కృషి

ఓటు విలువను తెలియజేస్తూ చేపట్టిన SVEEP కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 2019 MP ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 3.26 శాతం ఓట్ల శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: 2019-44.75%, 2024-48.48% నమోదు.
సికింద్రాబాద్:2019-46.26%, 2024-49.04% నమోదు.
మల్కాజిగిరి:2019-49.63%, 2024- 50.78% నమోదు.
చేవెళ్ల: 2019-53.25% 2024-56.50% నమోదైంది.
Similar News
News September 14, 2025
మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్‌నుమా, ఇంజిన్‌బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్‌హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.
News September 14, 2025
HYD: అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్..?

ఇప్పుడు ఏ నోట విన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తాజాగా గాంధీభవన్‌లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలంటూ చిట్ చాట్ చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం నుంచి ఎవరూ కూడా మంత్రిగా లేరని, తనకంటే సీనియర్ ఎవరైనా జూబ్లీహిల్స్ నుంచి ఉంటే తాను టికెట్ అడగనంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్‌లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.