News May 15, 2024
విశాఖ: ఉక్కు ఉద్యోగులకు అందని వేతనాలు

మే15వ తేదీ వచ్చినా ఉక్కు ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహకు గురవుతున్నారు. ఇంటి అద్దెలు, నెలవారీ బ్యాంకుల చెల్లింపులు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒకటో తేదీన సగం వేతనం, ఆ తర్వాత సగం వేతనం చెల్లించేవారు. ఈనెల అదీ లేకపోవడంతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు. కంపెనీ రొటేషన్ తక్కువగా ఉండటం వల్ల వేతనాలు చెల్లింపు ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News March 12, 2026
విశాఖలో రూ.100 కోట్లతో భారీ అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్

విశాఖలో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్ రిసార్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పర్యాటక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ముంబాయిలో జరిగిన IAAPI ఎక్స్‌పో-2026 మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఒప్పందం అయ్యింది. 100 గదుల సామర్థ్యం కలిగిన విలాసవంతమైన రిసార్ట్ ఉంటుందని, సుమారు 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
News March 12, 2026
ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం: క్యాప్ జెమినీ సీఈవో

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).
News March 12, 2026
విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. విశాఖలో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. నగరం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో క్లౌడ్, బీపీఎం సేవల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తెలిపారు.


