News May 15, 2024

ప.గో: జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌

image

ఉమ్మడి ప.గో.జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి భారతి తెలియజేశారు. 16న బాలురకు సంబంధించి భీమడోలు మండలం పోలసానిపల్లి పాఠశాలలో, 17న బాలికలకు అక్కడే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 3, 2026

ఆకివీడు సీఐ జగదీశ్వరరావు సస్పెండ్

image

ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ నిందితుడు సుధీర్ వర్మపై వచ్చిన ఫిర్యాదులో పోక్సో (POCSO) కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాకా 2024 ఆగస్టులో ఆకివీడు సీఐగా నియమితులయ్యారు.

News March 3, 2026

ప.గో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 2, 2026

భీమవరం: పోలీస్ శాఖ పీజీఆర్ఎస్‌కు 14వ అర్జీలు

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 14 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా అందాయి. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.