News May 15, 2024
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మందస మండలం బిన్నలమదనాపురం-బాలిగాం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచిలి మండలం గుండమూరుకు చెందిన లక్ష్మణరావు(43) 20 ఏళ్లుగా పలాసలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓటు వేయడానికి 13న బైక్‌పై సొంత గ్రామానికి వచ్చాడు. ఓటు వేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన బైక్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News March 15, 2026
శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.
News March 15, 2026
శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ కోసం క్యూ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెట్రోలు కోసం బoకుల వద్ద జనం క్యూ కడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఊహాగానాలు జోరందుకోవడంతో ప్రజలు పెట్రోలు బంకులకు పరిగెడుతున్నారు. ఈ ఊహాగానలలో నిజం లేదని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు తెలిపాయి. దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, రూమర్స్ నమ్మొద్దని సూచిస్తున్నా… పానిక్ బైయింగ్స్ కొనసాగుతున్నాయి
News March 14, 2026
1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం: శ్రీకాకుళం కలెక్టర్

జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షలు 1,13,102 మంది మార్చి 15వ తేదీన రాయనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యాసకులకు అన్ని మండల, మున్సిపాలిటీ, గ్రామ వార్డుల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో 1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.


