News May 15, 2024
అనంత: YCPకి ఓటు వేసిందనే హత్య..?

కంబదూరు మండలం వైసీపల్లిలో మంగళవారం వెంకటేశ్ తన తల్లి సుంకమ్మను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. సుంకమ్మ వైసీపీకి ఓటు వేసిందనే వెంకటేశ్ ఆమెను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. వెంకటేశ్ టీడీపీలో ఉన్నాడు. 13న తాను వైసీపీకి ఓటు వేసినట్లు వెంకటేశ్‌కు సుంకమ్మ చెప్పింది. ఆగ్రహంతో వెంకటేశ్ సుత్తితో కొట్టడంతో సుంకమ్మ మృతి చెందింది. పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News March 7, 2026
సమన్వయంతో విజయవంతం చేయండి: కలెక్టర్

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ, మెప్మా సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు.
News March 6, 2026
నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.
News March 6, 2026
అనంత విద్యార్థులకు ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగాలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. Infosys కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 8మంది ఎంపికయ్యారు. వీరికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ హంచాటే సుదర్శనరావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో మంచి అవకాశాలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.


