News May 15, 2024

పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ ప్రత్యేక కమిటీ

image

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏడుగురితో ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.

Similar News

News November 17, 2024

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరనాయక్ చెప్పారు. 

News November 17, 2024

ప్రభుత్వంలోని మంచి, చెడులను వెలికి తీయాలి: మంత్రి

image

మంగళగిరి: జర్నలిస్టులు ప్రభుత్వంలో జరుగుతున్న మంచి, చెడులను విచక్షణారహితంగా వెలుగులోకి తీసుకురావాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఈపురి రాజారత్నం రచించిన ‘జర్నలిజం జర్నలిస్టుల బేసిక్స్’ పుస్తకాన్ని ఆయన శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. పలువురు జర్నలిస్టులు మస్తాన్ రావు, బత్తుల సాంబశివరావు, ఎస్‌కె రఫీ పాల్గొన్నారు.

News November 16, 2024

గుంటూరు: జాతీయ రహదారిపై మూడు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

image

గుంటూరు నగర శివారు నల్లపాడు స్టేషన్ పరిధిలోని బుడంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మరమ్మతులకు గురైన కార్ల కంటైనర్‌ను ప్లేవుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ప్లేవుడ్ లోడ్ లారీని ఐచర్ లారీ ఢీకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.