News May 15, 2024

నిప్పులకొలిమిలా శ్రీకాకుళం

image

శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రెండు రోజులుగా వాతావరణంలో వేడి ఎక్కువ కావడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Similar News

News March 28, 2026

శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?

image

శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్ల సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈమె కర్నూలు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డి మోషన్ చేసినట్లు సమాచారం.

News March 28, 2026

శ్రీకాకుళం: త్వరలో కాలేజీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్

image

ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ అర్హత సాధించాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. మాన్యువల్ హాజరు వల్ల అనర్హులకు రియంబర్స్మెంట్ అందుతుందని ప్రభుత్వ భావన. అందుకే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్, 101 డిగ్రీ, 14 బీఈడీ, ఆరు పీజీ, 9 పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో రూ. కోట్లలో రియంబర్స్మెంట్ పొందుతున్నారు.

News March 28, 2026

శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంతాల్లో హీట్ వేవ్

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జలో వడగాల్పులకు అవకాశం ఉందని తెలియజేసింది. బూర్జ మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులు, మెరుపులతో వడగళ్ల వాన సైతం కురుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండలు అధికంగా ఉండే బయట తిరగరాదని విపత్తుల శాఖ హెచ్చరించింది.