News May 15, 2024
బాపట్ల జిల్లాలో రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్, ఎస్పీ

బాపట్ల జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 1, 2025
ANU: బీఈడీ, ఎల్‌ఎల్‌ఎం రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. తృతీయ సెమిస్టర్ బిఈడి, ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.
News November 1, 2025
ANU: యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ.1860 చొప్పున, జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, జిరాక్స్ కాపీలకు రూ.2190 చొప్పున చెల్లించాలన్నారు.
News November 1, 2025
గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.


