News May 15, 2024

నంద్యాల: ఎంసెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

ఈనెల 17 నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు. పలువురు అభ్యర్థులకు నంద్యాల జిల్లాలోని ఆర్జీఎం, శాంతిరాం కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అయితే ఈ కళాశాలల్లో ఈవీఎంలను భద్రపర్చడంతో ఆ 2 కళాశాలలను పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో ఈ కేంద్రాలు ఉంటే మళ్లీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Similar News

News October 2, 2025

ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

image

ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులతో చర్చించి, పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. నగరంలో జీఎస్టీ సంస్కరణలపై రోడ్డు షో నిర్వహిస్తున్నందున వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి క్యాంప్, నంద్యాల చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించారు.

News October 1, 2025

బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకుందాం: ఎస్పీ

image

బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని పటిష్ఠ చర్యలు చేపట్టిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకోవాలన్నారు. ఇప్పటికే 200 మంది ట్రబుల్ మాంగర్స్‌పై బైండోవర్ కేసులు నమోదు చేసి, 340 రింగ్ కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 800 మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు.

News October 1, 2025

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో పెన్షన్లను పంపిణీ చేశారు. అలాగే సి క్యాంపు రైతు బజార్లో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వ్యాపారులకు, ప్రజలకు తెలియజేశారు. కలెక్టర్ వెంట నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.