News May 15, 2024

కేంద్రమంత్రికి మాతృవియోగం

image

కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తల్లి మాధవీరాజే సింధియా మృతి చెందారు. న్యుమోనియాతో బాధపడుతోన్న ఆమె 3 నెలలుగా ఢిల్లీలోని AIIMSలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ X ద్వారా వెల్లడించారు. కాగా సింధియా మధ్యప్రదేశ్‌లోని గునా పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Similar News

News March 17, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,781 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో మంగళవారం 60 సెంటర్లలో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. నేటి పరీక్షలకు 13,156 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 12,781 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. 375 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.

News March 17, 2026

ప్రపంచంలో క్రూడాయిల్ ఎక్కువగా వాడే దేశాలివే..

image

2024 లెక్కల ప్రకారం క్రూడాయిల్ వినియోగంలో అమెరికా, చైనా టాప్‌లో ఉన్నాయి.
1. అమెరికా: 19 మిలియన్ బ్యారెళ్లు (ఒక రోజులో)
2. చైనా: 16.4 మి. బ్యారెళ్లు
3. భారత్: 5.6 మి. బ్యారెళ్లు
4. సౌదీ అరేబియా: 4 మి. బ్యారెళ్లు
5. రష్యా: 3.8 మి. బ్యారెళ్లు
6. జపాన్: 3.2 మి. బ్యారెళ్లు
7. సౌత్ కొరియా: 2.9 మి. బ్యారెళ్లు
>మిలియన్ అంటే 10 లక్షలు. బ్యారెల్ అంటే 159 లీటర్లు

News March 17, 2026

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. గ్యాస్, చమురు ట్యాంకర్లు భారత్‌కు చేరుతుండడం సెంటిమెంట్‌ను పెంచింది. కీలక రంగాల షేర్లు అట్రాక్టివ్ ప్రైస్‌కు తగ్గడంతో కొనుగోళ్ల కళ కనిపించింది. సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 76,070 వద్ద క్లోజైంది. నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 23,581 వద్ద స్థిరపడింది. ఎటర్నల్, టాటా స్టీల్, M&M, BEL షేర్లు లాభపడగా.. ఇన్ఫీ, ITC, TCS నష్టపోయాయి.