News May 15, 2024

నెల్లూరు రూరల్ రూలర్ ఎవరో..?

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏలబోయే నాయకుడెవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. జిల్లాలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న స్థానాల్లో రూరల్ ఒకటి. 66.18 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు మాత్రం సైలెంట్‌గా ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. జూన్ 4 తర్వాత రూరల్ రూలర్ ఎవరో తేలనుంచి.

Similar News

News March 17, 2026

నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

image

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.

News March 17, 2026

నెల్లూరు: నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ..

image

భర్త తీరుతో మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకుంది. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత(20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2026

నెల్లూరు: పది పరీక్షకు 246 మంది డుమ్మా

image

నెల్లూరు జిల్లాలో మొదటిరోజు 10వ తరగతి పరీక్షకు 246 మంది గైర్హాజరైనట్లు DEO బాలాజీ రావు తెలిపారు. 174 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా 28,131 మంది విద్యార్థులకు గాను 27,871 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా పరీక్షను నిర్వహించామని తెలిపారు.