News May 15, 2024

తిరుమలలో చిరుత కలకలం

image

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డుగా వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసింది.

Similar News

News March 16, 2026

స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్‌

image

వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.

News March 16, 2026

భారత్‌కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

image

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.

News March 16, 2026

టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

image

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.