News May 15, 2024
అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఇదే..
AP: దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైంది. 3500 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి 2 వరకు పోలింగ్ కొనసాగింది. పార్లమెంట్‌కి 3,33,40,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు’ అని తెలిపారు.
Similar News
News January 11, 2025
ప్రైవేటు సరే.. మీరెందుకు పెంచారు సార్?
TG: ప్రైవేట్ బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సంక్రాంతి కోసం TGSRTC నడుపుతున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీలు పెంచారని, దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నిస్తున్నారు. అటు APSRTC స్పెషల్ బస్సుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడంతో ఏపీకి వెళ్లే చాలా మంది ఆ బస్సులే ఎక్కుతున్నారు.
News January 11, 2025
నేడు కర్నూలు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన
AP: Dy.CM పవన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును ఆయన పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో ప్రాజెక్టులోని సౌర విద్యుత్, హైడల్ పవర్ ప్లాంట్‌లను ఏరియల్ వ్యూ చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ప్రాజెక్టును సందర్శిస్తారు. సాయంత్రం 4.50గం.కు కర్నూలు నుంచి ఆయన తిరుగుపయనం అవుతారు.
News January 11, 2025
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్: కొత్త రూల్స్ ఇవే
TG: వచ్చే విద్యా సంవత్సరంలో SC విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.
☛ విద్యార్థుల పేరు ఆధార్, టెన్త్ మెమోలో ఒకేలా ఉండాలి
☛ మీ సేవ కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ పూర్తిచేయాలి
☛ తర్వాత ఈ-పాస్ <
☛ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి
☛ కాలేజీ యాజమాన్యాలే విద్యార్థుల అప్లికేషన్లను పరిశీలించి అధికారులకు పంపాలి