News May 15, 2024

రేపు మహారాష్ట్రకు చంద్రబాబు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం షిరిడి సాయిబాబాను దర్శించుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Similar News

News March 4, 2026

నెతన్యాహు సైనికుడిగా ఉన్నప్పుడు..

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో ఆ దేశ సైన్యంలో పని చేశారు. 1967 నుంచి 1973 వరకు ఆరేళ్ల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)లో సేవలు అందించారు. IDFలో టాప్ సీక్రెట్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే ‘Sayeret Matkal’ అనే యూనిట్‌లో పని చేశారు. 1972లో సబేనా ప్లేన్ బందీల రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 1973లో కెప్టెన్ ర్యాంక్ సాధించారు. 1996లో ఇజ్రాయెల్ ప్రధానిగా గెలిచి, పిన్నవయసు PMగా ఘనత సాధించారు.

News March 4, 2026

పుట్టిన నగరంలోనే ఖమేనీ ఖననం?

image

ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్‌‌లోని మషాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ పుట్టినిల్లు అయిన ఈ మషాద్ టెహ్రాన్ తర్వాత ఇరాన్‌లోనే అతిపెద్ద నగరం. ఇక్కడి ప్రఖ్యాత ఇమామ్ రెజా ష్రైన్‌లోనే ఖమేనీ తండ్రి సమాధి ఉంది. ఖమేనీకి సైతం ఇక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఇమామ్ రెజా ష్రైన్‌ షియా ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఏటా ఈ ప్రాంతాన్ని 3 కోట్ల మంది సందర్శిస్తారు.

News March 4, 2026

అమెరికా-ఇరాన్ పోరుపై RGV ట్వీట్

image

మిడిల్ఈస్ట్‌ను ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టేసిన అమెరికా-ఇరాన్ పోరుపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జీసస్ – అల్లాకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్న RGV.. ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానన్నారు. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కావడంతో ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.