News May 15, 2024
RCBపై నేను ఆడి ఉంటే ప్లేఆఫ్స్‌కి వెళ్లేవాళ్లమేమో: పంత్
RCBతో మ్యాచ్‌లో తాను ఆడి ఉంటే తాము నాకౌట్‌కు చేరేవాళ్లమేమో అని ఢిల్లీ కెప్టెన్ పంత్ అభిప్రాయపడ్డారు. తన వల్లే జట్టు గెలుస్తుందని కాదని.. ప్లేఆఫ్స్‌కి చేరేందుకు మరింత మెరుగైన అవకాశాలుండేవని పేర్కొన్నారు. కాగా స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ 14 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. CSK, SRH, RCB తమ చివరి మ్యాచుల్లో ఘోరంగా ఓడితేనే DCకి అవకాశం వస్తుంది.
Similar News
News January 11, 2025
రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి: ITDP
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లలో రద్దీ కనిపించింది. ఈ నేపథ్యంలో ITDP ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘అమరావతిని నిర్మించుకుందాం, విశాఖను ITహబ్‌గా తీర్చిదిద్దుకుందాం. రాయలసీమకు పరిశ్రమలు తెచ్చుకుందాం. ఆంధ్రులకు పొరుగు దేశానికి, రాష్ట్రానికి వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం కలిసిరండి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి!’ అని పేర్కొంది.
News January 11, 2025
నేడు బీజీటీపై బీసీసీఐ సమీక్ష
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ ఘోర ప్రదర్శనపై బీసీసీఐ ఈరోజు సమీక్షించనుంది. బోర్డు పెద్దలు పాల్గొనే ఈ సమావేశంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తమ వివరణను ఇవ్వనున్నారు. భవిష్య టెస్టు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. పదేళ్లలో ఈ సిరీస్ ఓటమి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
News January 11, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ పాసై, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అర్హులు. వయసు జనవరి, 2025 నాటికి 25 ఏళ్లు పైబడి ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.40వేల నుంచి రూ.1.40 లక్షలు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు లాస్ట్ డేట్: జనవరి 31
వెబ్‌సైట్: <