News May 15, 2024
ఒక్క మలుపు లేకుండా 256 కి.మీ రహదారి
ఆస్ట్రేలియాలోని అతిపొడవైన నిటారు రోడ్డు (146 కి.మీ) రికార్డును సౌదీ అరేబియా బద్దలు కొట్టింది. ఇటీవల అక్కడ 256 కిలోమీటర్ల రహదారి హైవే 10ని ఒక్కమలుపూ లేకుండా నిర్మించినట్లు అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది. వరల్డ్‌లోనే అతి పొడవైన నిటారు రోడ్డుగా ఇది రికార్డుల కెక్కింది. హరద్ నుంచి యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా వరకు ఈ రహదారిని నిర్మించారు. ఈ రోడ్డుపై కేవలం 2 గంటల్లోనే వాహనదారులు గమ్యాన్ని చేరుకోవచ్చట.
Similar News
News January 11, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో జడేజా డౌట్?
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఆల్‌రౌండర్ జడేజా స్థానంపై సందిగ్ధం నెలకొంది. అతడిని జట్టులోకి తీసుకోవాలా? భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూనియర్లకు చోటు కల్పించాలా? అనే దానిపై BCCI ఆలోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆల్‌రౌండర్‌కు అక్షర్, దూబే, సుందర్ నుంచి పోటీ ఉంది. CTలో భారత్ దుబాయ్‌లో స్పిన్ పిచ్‌లపై ఆడుతుండటంతో అనుభవమున్న ప్లేయర్ కావాలని భావిస్తే జడేజాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
News January 11, 2025
సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి: KTR
TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్‌కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
News January 11, 2025
వారికి నెలకు రూ.2లక్షల జీతం
AP: క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.