News May 15, 2024

WOW.. నీటి ఆధారిత బ్యాటరీ అభివృద్ధి

image

చైనాకు చెందిన శాస్త్రవేత్తలు నీటి ఆధారిత బ్యాటరీని అభివృద్ధి చేశారు. సాంప్రదాయ లిథియం బ్యాటరీలతో పోల్చితే దాదాపు రెట్టింపు శక్తి సాంద్రతతో పనిచేస్తాయని పరిశోధనలో తెలిసింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించవచ్చని, అత్యంత మండే నిర్జల లిథియం బ్యాటరీల కంటే ఇవి సురక్షితమైనవిగా ప్రకటించింది. ఇలాంటి పరిశోధనలు ఇండియాలోనూ జరగాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 11, 2025

సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి: KTR

image

TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్‌కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

News January 11, 2025

వారికి నెలకు రూ.2లక్షల జీతం

image

AP: క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్‌ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.

News January 11, 2025

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వచ్చి పుష్కరమైంది

image

పండుగొచ్చిందంటే చాలు టీవీల్లో శ్రీకాంత్ అడ్డాల తీసిన కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రసారమవుతుంది. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబాల మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు, పల్లెటూరి అందాలను ఎంతో చక్కగా చూపించారు.