News May 15, 2024
సంతబొమ్మాళి: APRJCలో సత్తా చాటిన విద్యార్థినులు

సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెద్దిన భవానిAPRJC బైపీసీలో రాష్ట్రస్థాయిలో 53వ ర్యాంకు సాధించింది. పాలిటెక్నిక్‌లో 550 ర్యాంకు సాధించింది. అలాగే బడే నరసాపురానికి చెందిన సుంకరి రజిత ఏపీఆర్‌జెసీ బైపీసీలో 143 ర్యాంక్ సాధించింది. వీరికి గ్రామ సర్పంచ్ దుక్క భూషణ్ రెడ్డి, షణ్ముఖ మాస్టర్, ఫాల్గుణ రెడ్డి, సిమ్మాన్న మాస్టర్‌లు మిఠాయిలు తినిపించి అభినందించారు.
Similar News
News September 13, 2025
శ్రీకూర్మనాథ క్షేత్రం పాలకమండలి నియామకం

గార(M) శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రానికి పాలకవర్గ సభ్యులును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా(వంశపారంపర్య ధర్మకర్త) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్వవహరిస్తారు. తొమ్మిది మంది సభ్యులుగా సంయుక్త, కుసుమకుమారి, పెంటయ్య, శ్రీనివాసరావు, మునీక, శ్వేతబిందు, సూరిబాబు, కళ్యాణచక్రవర్తి, లక్ష్మిలను నియమించింది. అఫీషియో మెంబర్‌గా సీతారామనృసింహులు ఎన్నికయ్యారు.
News September 13, 2025
శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు ఎరువులకు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను భరోసా కల్పించారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు తమకున్న ఎరువుల సమస్యలను ఫోన్‌లో కలెక్టర్‌కు వివరించారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామానికి చెందిన ఎల్.సోమేశ్వరరావు, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన రాజశేఖర్ నాయుడు, SM పురానికి చెందిన ఈశ్వరరావుతో పాటు పలు రైతులు సమస్యలను తెలియజేశారు.
News September 12, 2025
కోటబొమ్మాళి: విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి

కోటబొమ్మాళి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్‌మెన్ సురేష్ (32) విద్యుత్ షాక్‌కు గురై శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఏఈ ఆధ్వర్యంలో కిష్టపురంలో సూరేశ్ మరి కొంతమందితో కలిసి 33KV విద్యుత్ లైన్ల మర్మతులు చేస్తున్నాడు. కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.