News May 15, 2024
‘దేవర’ నుంచి క్రేజీ అప్‌డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఒకరోజు ముందే 19న FearSongను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. FearSong మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న మాస్ పోస్టర్‌ను జత చేశారు.
Similar News
News January 11, 2025
ఫిబ్రవరి 15 నుంచి 28లోపు అమల్లోకి భూ భారతి చట్టం: మంత్రి
TG: భూ భారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ లోపు ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా దీనిని అమలు చేస్తామని చెప్పారు. ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, ధరణిని వాడుకుని తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
News January 11, 2025
రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే..
ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు), సచిన్ (276 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.
News January 11, 2025
NEET రద్దు: పాలకులపై మండిపడ్డ యాక్టర్ విజయ్
ప్రస్తుత పాలకులు ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారంటూ DMKపై TVK అధినేత, యాక్టర్ విజయ్ మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రద్దు చేయించే సీక్రెట్ తెలుసని ఊదరగొట్టారు. ఇప్పుడేమో నీట్‌ను రద్దుచేసే అధికారం కేంద్రానిదే అంటున్నారు. దీనికోసమే మీకు ఓటేసిన వారిని ఇది మోసం చేసినట్టు కాదా’ అని ప్రశ్నించారు. తమిళంలో ఓ పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.