News May 15, 2024

మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ

image

వారణాసిలో PM మోదీపై ఇండిపెండెంట్‌గా పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. అతను అఫిడవిట్ సమర్పించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చిన శ్యామ్.. ఆఖరి రోజైన నిన్న నామినేషన్ వేశారు. మోదీ, రాహుల్‌లను అనుకరిస్తూ ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ పేరు సంపాదించాడు. కొద్దికాలంగా మోదీ విధానాలను విమర్శిస్తూ వీడియోలు చేశాడు.

Similar News

News January 11, 2025

NEET రద్దు: పాలకులపై మండిపడ్డ యాక్టర్ విజయ్

image

ప్రస్తుత పాలకులు ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారంటూ DMKపై TVK అధినేత, యాక్టర్ విజయ్ మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రద్దు చేయించే సీక్రెట్ తెలుసని ఊదరగొట్టారు. ఇప్పుడేమో నీట్‌ను రద్దుచేసే అధికారం కేంద్రానిదే అంటున్నారు. దీనికోసమే మీకు ఓటేసిన వారిని ఇది మోసం చేసినట్టు కాదా’ అని ప్రశ్నించారు. తమిళంలో ఓ పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.

News January 11, 2025

ముంబైలో ఒంటరిగానే పోటీ: సంజయ్ రౌత్

image

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (UBT) ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబై, నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుంది. దీంతో ఇండియా కూటమి భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.

News January 11, 2025

భారత T20 జట్టు సెలక్షన్‌పై రేపు మీటింగ్

image

ఇంగ్లండ్‌తో స్వదేశంలో T20 సిరీస్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబైలో సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టును మాత్రమే ఎంపిక చేస్తారని వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్ల ఎంపికలపై ప్రస్తావన ఉండదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంగ్లండ్‌తో భారత్ 5 T20లు ఆడనుంది.