News May 15, 2024

పీవోకేను తప్పక స్వాధీనం చేసుకుంటాం: అమిత్ షా

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పీవోకేను పాకిస్థాన్ నుంచి తిరిగి తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పామని చెప్పారు. పీవోకేలో ప్రజలు కూడా తమను భారత్‌లో విలీనం చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. అక్కడి ప్రజలకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 5, 2026

ఖర్జూరంతో ఆరోగ్యంగా వెయిట్ లాస్‌.. కారణమిదే!

image

* ఖర్జూరాలను బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.
* ఎక్కువ సమయం ఆకలి వేయదు.
* ఒకటి/రెండు తినే సరికి స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఆకలి తక్కువ వేస్తుంది.
* ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ల కారణంగా జీవక్రియ మెరుగుపడుతుంది.
* తక్కువ క్యాలరీలు తీసుకోవడంతో హెల్తీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

News February 5, 2026

రైతులకు రిటర్న్ ప్లాట్‌లు.. 16న లాటరీ

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16న ప్లాట్‌ల కేటాయింపునకు CRDA లాటరీ తీయనుంది. ఈ-లాటరీ ద్వారా రైతులకు నిబంధనల ప్రకారం ప్లాెెట్‌లు కేటాయిస్తారు. వాటిని రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

News February 5, 2026

UPSC అప్లికేషన్‌ ప్రాసెస్‌లో కీలకమార్పులు

image

ఆలిండియా సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ 2026లో UPSC కీలక మార్పులు చేసింది. అప్లై చేసేటప్పుడు పాస్‌పోర్ట్ ఫొటోతోపాటు లైవ్ ఫొటోను కూడా తప్పనిసరి చేసింది. 2 ఫొటోలు మ్యాచ్ కాకుంటే అప్లికేషన్ రిజెక్టవుతుందని తెలిపింది. వైట్ పేపర్‌పై బ్లాక్ ఇంక్ పెన్‌తో 3సార్లు సంతకం చేసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామ్ ప్రొసీజర్లలో పారదర్శకతకు ఈ విధానం సహాయపడుతుందని చెప్పింది.