News May 15, 2024
పుష్ప-2లో అనసూయ లుక్
పుష్ప-2లో అనసూయ భరద్వాజ్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ దాక్షాయణి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. టేబుల్‌పై ఠీవిగా కూర్చొన్న అనసూయ మాస్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Similar News
News January 11, 2025
ముంబైలో ఒంటరిగానే పోటీ: సంజయ్ రౌత్
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (UBT) ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబై, నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుంది. దీంతో ఇండియా కూటమి భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.
News January 11, 2025
భారత T20 జట్టు సెలక్షన్‌పై రేపు మీటింగ్
ఇంగ్లండ్‌తో స్వదేశంలో T20 సిరీస్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబైలో సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టును మాత్రమే ఎంపిక చేస్తారని వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్ల ఎంపికలపై ప్రస్తావన ఉండదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంగ్లండ్‌తో భారత్ 5 T20లు ఆడనుంది.
News January 11, 2025
జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి
TG: రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తామని వివరించారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.