News May 15, 2024

రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్ కళ్యాణ్

image

చిన్నగంజాం నుంచి బయలుదేరిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీకొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమని అన్నారు. అక్కడ బైపాస్ రోడ్డు పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని పేర్కొన్నారు.

Similar News

News January 4, 2026

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు భద్రం: ఇన్‌ఛార్జ్ SP

image

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్ అంటే ఆశపడవద్దన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మవద్దన్నారు. డాటాను సైబర్ మోసగాళ్ల చేతిలో పెట్టవద్దన్నారు. ఈజీగా లోన్ వస్తుందని చిక్కుల్లో పడవద్దని హెచ్చరించారు.

News January 4, 2026

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇదే.!

image

మర్రిపూడి వైసీపీ MPP వెంకటరెడ్డిని పార్టీ నుంచి <<18753696>>సస్పెండ్‌<<>> చేసిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడితో అవగాహనా లోపం, పార్టీ ఎంపికల్లో మనస్పర్ధలు, దామచర్ల సత్యాతో ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం వంటి కారణాలు సస్పెండ్‌కు దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీలోనే సపోర్ట్ లేక వర్గపోరుతో ఇలా జరిగిందని, ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరి మీ కామెంట్.