News May 16, 2024
నల్గొండ- ఖమ్మం- వరంగల్‌పై గురి

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు KMM-NLG-WGL ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించాయి. ఎట్టి పరిస్థతుల్లోనూ ఈస్థానంలో పాగా వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. BRS నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా గతంలో ఈస్థానం నుంచి గెలిచిన పల్లా వ్యూహాలను రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈ దఫా బరిలోకి దింపింది.
Similar News
News November 10, 2025
రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ప్లాంట్ నిర్మాణానికి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్లాంట్ నిర్వహణ మహిళ సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. 25 ఏళ్లపాటు వారంటీతో కూడిన సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నారు.
News November 10, 2025
పాత కక్షలతో హత్య.. ఇద్దరు నిందితులు అరెస్టు

ఎదులాపురం ముత్తగూడెంకు చెందిన బురా శ్రీనివాస్‌ను పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు రూరల్ సీఐ ఎం. రాజు తెలిపారు. బురా డేవిడ్, పేరెల్లి రాజశేఖర్ సుపారీ మాట్లాడుకుని శ్రీనివాస్‌ను కారులో కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఎన్ఎస్‌పీ కెనాల్‌లో పడేశారని సీఐ వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
News November 8, 2025
ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


