News May 16, 2024
కొడుకుపై తల్లి పోటీ
బిహార్‌లోని కారాకట్ లోక్‌సభ నియోజకవర్గంలో భోజ్‌పురి సింగర్, నటుడు పవన్‌సింగ్‌పై తన తల్లి ప్రతిమాదేవి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులే. తొలుత బెంగాల్‌లోని అసన్‌సోల్ అభ్యర్థిగా పవన్‌సింగ్‌ను BJP ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో పవన్ పోటీ నుంచి తప్పుకొని, కారాకట్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. అక్కడా NDA అభ్యర్థి బరిలో ఉండటంతో.. పోటీ నుంచి తప్పుకోవాలని BJP హెచ్చరించింది.
Similar News
News January 11, 2025
ఎవరి మద్దతు కోరడం లేదు: DK శివకుమార్
కర్ణాటక CM మార్పు ఊహాగానాలపై Dy.CM DK శివకుమార్ స్పందించారు. సీఎంగా తన పేరు ప్రస్తావించాలని తాను ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదన్నారు. అలాగే తాను ఎవరి మద్దతూ కోరుకోవడం లేదని, MLAలు తనకు మద్దతుగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘నేను కర్మనే నమ్ముకున్నా. ఫలితాన్ని దేవుడికే వదిలేస్తా. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా’ అని డికె పేర్కొన్నారు.
News January 11, 2025
సంక్రాంతికి AP లోడింగ్!
సంక్రాంతికి AP సిద్ధమవుతోంది. అక్కలు, బావలు, మామలు, అల్లుళ్ల రాకతో తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకుంటున్నాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, రంగవల్లులు, కుర్రాళ్ల సరదాలు, స్నేహితుల గెట్ టుగెదర్లు, కొత్త సినిమాలు.. ఇలా సంబరాల సరదా జోరందుకుంది. వీటితో పాటు కోడి పందేలు, ఎద్దుల పోటీలు, జాతరలకై బరులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది స్వస్థలాలకు చేరుకోగా మిగిలినవారు రేపు, ఎల్లుండి చేరుకోనున్నారు.
News January 11, 2025
GMSను ఆకర్షణీయంగా మార్చండి: కేంద్రానికి వినతి
దిగుమతులు తగ్గించేందుకు ఇళ్లలో నిరుపయోగ బంగారాన్ని సాయంగా వాడుకోవాలని గోల్డ్ ట్రేడ్ బాడీస్ కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇందుకోసం కొత్త బడ్జెట్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాలని అంటున్నాయి. గోల్డ్ డిపాజిట్లకు ఫ్లెక్సిబుల్ టెన్యూర్స్, ఎక్కువ వడ్డీరేట్లు ఇవ్వాలని, 500gr వరకు వారసత్వ బంగారం డిపాజిటుకు అవకాశమివ్వాలని, ట్యాక్స్ ఎంక్వైరీలు లేకుండా చూడాలని సూచించాయి.