News May 16, 2024

ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల

image

APలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.

Similar News

News January 9, 2025

కొనసాగుతున్న విచారణ.. ప్రశ్నల వర్షం!

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి KTRను విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా? అని ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐలు మాజీ మంత్రిని విచారిస్తున్నారు.

News January 9, 2025

BITCOIN: 24 గంటల్లో రూ.2.5లక్షలు లాస్

image

క్రిప్టో మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. గత 24 గంటల్లో మార్కెట్ విలువ 1.65% తగ్గి $3.3Tకి చేరుకుంది. ఇక బిట్‌కాయిన్ 2.21% అంటే $3000 (Rs 2.5L) నష్టపోయింది. $97,443 వద్ద గరిష్ఠాన్ని టచ్ చేసిన BTC $94,500 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ డామినెన్స్ 56.5 శాతంగా ఉంది. $3,384 వద్ద గరిష్ఠాన్ని తాకిన ETH 1.02% నష్టపోయి $3,334 వద్ద కొనసాగుతోంది. SOL 1.26, DOGE 3.53, ADA 5.89, AVAX 4.35% పతనమయ్యాయి.

News January 9, 2025

మోహన్ బాబుకు స్వల్ప ఊరట

image

సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.