News May 16, 2024

REWIND-2019: జహీరాబాద్‌లో BRSకి 6,229 ఓట్ల మెజార్టీ!

image

జహీరాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. మదన్ మోహన్(కాంగ్రెస్)పై బీబీ పాటీల్ (BRS) 6,229 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. బాణాల లక్ష్మారెడ్డి (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్), బీబీపాటీల్ (BJP), గాలి అనిల్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

Similar News

News January 24, 2025

ఆర్మూర్: ఆదిలాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయాలు

image

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్న ఇద్దరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ K. స్టీవెన్సన్ తెలిపారు. తొర్లికొండకు చెందిన నూనె కిరణ్, అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ లు అక్రమంగా గంజాయిని విక్రయాల కోసం బైక్ పై రవాణా చేస్తూ అంకాపూర్ వద్ద పట్టుబడ్డారని CIవివరించారు.

News January 24, 2025

NZB: గంజాయితో ఒకరిని అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.

News January 24, 2025

NZB: పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ అర్వింద్

image

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరగా పసుపు బోర్డు కార్యక్రమాలను మొదలుపెడతామని స్పష్టం చేశారు.