News May 16, 2024
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత ప్రత్యక్షం
AP: తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించడంతో యాత్రికులు ఆందోళనలో పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు కారులో వెళ్తున్న భక్తులకు చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. శేషాచలం అడవుల్లో చిరుతలు కనిపించడం సాధారణమైనప్పటికీ పాదచారుల మార్గం, ఘాట్ రోడ్లలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. గతేడాది ఆగస్టులో ఆరేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2025
ఢిల్లీ కాంగ్రెస్ ఫైర్.. పృథ్వీరాజ్ చవాన్ యూటర్న్!
కాంగ్రెస్ సీనియర్ నేత, MH EX CM పృథ్వీరాజ్ చవాన్‌పై ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ మండిపడింది. ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీపై అంత నమ్మకముంటే ఆ పార్టీ టికెట్ పైనే పోటీచేయాల్సిందని విమర్శించింది. ఢిల్లీలో AAP గెలుస్తుందంటూ ఆయన జోస్యం చెప్పడంతో ఫైర్ అయింది. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని, పొత్తు ఉండుంటే INDIA కూటమి గెలిచేదని చెప్పినట్టు <<15104187>>చవాన్<<>> వివరణ ఇచ్చుకున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌దే గెలుపని తాజాగా చెప్పారు.
News January 9, 2025
దేశవాళీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
టెస్టుల్లో ఫామ్ కోల్పోయిన కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ENGతో జరగనున్న టెస్టు సిరీస్‌కి సన్నద్ధం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోతే దేశవాళీలు ఆడి తమను తాము నిరూపించుకోవాల్సిందే అని కోచ్ గంభీర్ ఇటీవల చెప్పిన నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ENGతో 5టెస్టుల సిరీస్ Juneలో ప్రారంభం కానుంది.
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.