News May 16, 2024

MBNR: మొత్తం 5,575 పదో తరగతి ఫెయిల్

image

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 39,323 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 526 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు.

Similar News

News November 16, 2024

వనపర్తి: ‘కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకు’

image

కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులగణులకు వారి సామాజిక వర్గం వివరాలు సేకరిస్తే సరిపోతుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్లు, పశువుల వివరాలు అవసరమా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం చేసేందుకే ఇన్ని ప్రశ్నలు పెట్టారన్నారు. సర్వేను పునః పరిశీలించాలన్నారు.

News November 16, 2024

‘మెడికల్ హబ్’ గా కొడంగల్ 

image

‘మెడికల్ హబ్’గా కొడంగల్ మారనుంది. అందులో భాగంగానే వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే భవనాల నిర్మాణానికి స్థల సేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. అయితే నర్సింగ్ కాలేజీకి అడ్మిషన్లు జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు.

News November 16, 2024

కొత్తకోట వాసవీమాత ఆలయంలో ఈ నెల 18న లక్ష పుష్పార్చన

image

కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో 18న కార్తీక మాసం, మూడో సోమవారం పురస్కరించుకొని హరిహరులకు లక్ష పుష్పార్చన, జల దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు రాత్రి 8 గంటలకు కటకం కృష్ణస్వామి కుటుంబ సభ్యులు భక్తులకు ఉపాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.