News May 16, 2024

చంద్రుడిపై రైళ్లు ఎలా నడుస్తాయంటే?

image

చంద్రుడిపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ <<13221265>>ఆన్<<>> ఏ ట్రాక్’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం ‘మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ’ని వినియోగించనుంది. జాబిల్లిపై దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండటంతో ఈ టెక్నాలజీ 3-ఫేజ్ రైలు ట్రాక్‌పై ఫ్లోట్ రోబోట్‌లు తేలియాడుతూ ప్రయాణించేందుకు మార్గం సుగమం చేస్తుంది. చంద్రుడిపై ఫ్లోట్ రోబోలు సెకనుకు 0.5 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

Similar News

News January 11, 2025

రూ.10వేల కోట్ల విలువైన భవనం.. బుగ్గిపాలు

image

లాస్ ఏంజెలిస్‌లో చెలరేగుతున్న కార్చిచ్చులో పలు ఖరీదైన భవనాలు తగలబడిన సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ఖరీదైన బిల్డింగ్ విలువ రూ.10వేల కోట్లు! లూమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రసెల్ దీనికి యజమాని. 18 పడక గదులతో కూడిన రాజభవనంలాంటి ఆ బిల్డింగ్ దావానలంలో కాలి బుగ్గిపాలైంది. కాగా.. రూ.16.5 కోట్ల లాటరీ గెలుచుకున్న ఎడ్విన్ కాస్ట్రో అనే వ్యక్తికి చెందిన భవనం కూడా తగలబడిపోవడం గమనార్హం.

News January 11, 2025

విరాట్, రోహిత్ మళ్లీ పరుగులు చేస్తారు: ఇంగ్లండ్ బౌలర్

image

ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి గాడిలో పడతారని ఇంగ్లండ్ బౌలర్ టైమల్ మిల్స్ ధీమా వ్యక్తం చేశారు. ‘వారిద్దరికీ ఆ పేరు ఏదో యాదృచ్ఛికంగా వచ్చిపడింది కాదు. ఎన్నో పరిస్థితుల్లో, మరెంతో పోరాటంతో వేలాది పరుగులు చేశారు. క్రికెట్ ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఆ ఇద్దరూ ఉంటారు. వారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. తిరిగి పుంజుకుంటారు’ అని పేర్కొన్నారు.

News January 11, 2025

ఎవరి మద్దతు కోరడం లేదు: DK శివకుమార్

image

క‌ర్ణాట‌క CM మార్పు ఊహాగానాల‌పై Dy.CM DK శివ‌కుమార్ స్పందించారు. సీఎంగా తన పేరు ప్రస్తావించాలని తాను ఎవ‌రిపైనా ఒత్తిడి చేయ‌డం లేద‌న్నారు. అలాగే తాను ఎవ‌రి మ‌ద్ద‌తూ కోరుకోవ‌డం లేద‌ని, MLAలు త‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌క‌ట‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ‘నేను క‌ర్మ‌నే న‌మ్ముకున్నా. ఫ‌లితాన్ని దేవుడికే వ‌దిలేస్తా. ఈ విష‌యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల‌కు అనుగుణంగా పనిచేస్తా’ అని డికె పేర్కొన్నారు.