News May 16, 2024
భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దు: GHMC
TG: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.
Similar News
News January 11, 2025
సీఎం సంక్రాంతి కానుక.. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్
AP: సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. GPFకు రూ.519cr, CPSకు రూ.300cr, TDSకు రూ.265cr పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241cr, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.788cr, 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 cr, 651 కంపెనీలకు రూ.90 cr రాయితీ, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 cr, రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు రిలీజ్ చేయనున్నారు.
News January 11, 2025
అత్యధిక గంటలు పనిచేసేది ఈ దేశస్థులే..!
వారంలో 90 గంటలు పనిచేయాలంటూ L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రపంచంలోనే భూటాన్ దేశస్థులు అత్యధిక గంటలు పనిచేస్తున్నారు. వీరు వారానికి 54.4 గంటలు కష్టపడుతున్నారు. ఆ తర్వాత యూఏఈ-50.9 గంటలు, లీసోతో-50.4, కాంగో-48.6, ఖతర్-48, లైబీరియా-47.7, మారిటానియా-47.6, లెబనాన్-47.6, మంగోలియా-47.3, జోర్డాన్ దేశస్తులు 47 గంటలు. ఇండియాలో 48 గంటలు పని చేస్తున్నారు.
News January 11, 2025
‘సంక్రాంతి బంపర్ ఆఫర్.. ఉచిత రీచార్జ్’ అని మెసేజ్ వచ్చిందా?
సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీచార్జ్ అంటూ మెసేజ్‌లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయొద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయకండి. అది రీచార్జ్ కాదు.. మాల్‌వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు’ అని Xలో పోలీసులు ప్రకటన చేశారు.