News May 16, 2024

వల్లూరు: నీటిలో పడి యువకుడు మృతి

image

వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయ పల్లె ఆనకట్ట వద్ద నీటిలో మునిగి సాయి అనే యువకుడు మృతి చెందాడు. కడప పట్టణంలోని బికేఎం స్ట్రీట్‌కు చెందిన సాయి స్నేహితులతో కలిసి గురువారం సరదాగా గడపడానికి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి నీటిలో దిగిన అతడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 13, 2025

కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

image

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

News November 12, 2025

మదనపల్లి కిడ్నీ రాకెట్‌లో దొరికింది వీరే.!

image

అన్నమయ్య జిల్లాలో కిడ్నీలు కొట్టేసే ముఠాను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. విశాఖకు చెందిన ఓ మహిళకు మదనపల్లెలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో <<18262668>>కిడ్నీ తొలగించగా చనిపోయింది<<>>. దీంతో వారు మృతదేహాన్ని తిరుపతికి తరలించి దహనక్రియలు చేయాలని చూశారు. ఈలోగా మృతురాలి భర్త తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గుట్టు రట్టైంది. అక్కడ కేసు నమోదుచేసి మదనపల్లెకు ట్రాన్స్‌ఫర్ చేయగా ఆ ముఠాలోని దొంగలు పట్టుబడ్డారు.

News November 11, 2025

కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

image

సీఎం చంద్రబాబు చిన్నమండెం పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (A.S.L) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SP పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.