News May 16, 2024
దీపక్ మిశ్రా వల్లే విధ్వంసం: పేర్ని నాని

AP: ఉద్దేశపూర్వకంగానే పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను ఎన్నికల కోసం తీసుకొచ్చారని YCP నేత పేర్ని నాని ఆరోపించారు. ‘మిశ్రా రాష్ట్రానికి వచ్చిన దగ్గరి నుంచి TDP సానుభూతిపరులైన రిటైర్డ్ అధికారులను కలిశారు. జిల్లా SPలను కూడా ఆయన బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా రాష్ట్రం వదలి వెళ్లడం లేదు. ఆయన వల్లే రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. తక్షణమే ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News February 11, 2026
800లకు ఒక్క మార్కు.. అయినా MS ఆర్థోపెడిక్స్ సీటు!

NEET PGలో 800 మార్కులకు గానూ కేవలం ఒక్క మార్కు సాధించిన అభ్యర్థికి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో MS ఆర్థోపెడిక్స్ సీటు లభించింది. కటాఫ్ పర్సంటైల్‌ను సున్నాకు తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన 20 మందికి ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో సీట్లు దక్కాయి. టాప్ ర్యాంకర్లు ఎంచుకునే కోర్సులు సైతం 100లోపు మార్కులు వచ్చినవారికి దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
News February 11, 2026
తమిళనాడులో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు: స్టాలిన్

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని DMK అధినేత, సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2021 కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేస్తామని తెలిపారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో తనకు సోదర బంధం ఉందని పేర్కొన్నారు. అధికారాన్ని పంచుకోవడమనే ప్రశ్న ఇప్పుడు ముఖ్యం కాదన్నట్లుగా మాట్లాడారు.
News February 11, 2026
సల్మాన్ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటుంది: ఏక్‌నాథ్ షిండే

RSS శతాబ్ది వేడుకలకు నటుడు సల్మాన్ ఖాన్ హాజరవడంపై వస్తున్న విమర్శలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తిప్పికొట్టారు. సల్మాన్ భారతీయ పౌరుడని, మన సంస్కృతిని గౌరవిస్తారని గుర్తుచేశారు. ఆయన ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ఒక కార్యక్రమానికి హాజరైనంత మాత్రాన వివాదం చేయడం సరికాదన్నారు. ఆయన దేశభక్తిని, సంస్కృతిని గౌరవించే తత్వాన్ని చూడాలని సూచించారు.


