News May 16, 2024

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం: బొత్స

image

AP: వచ్చే నెల 9న విశాఖపట్నంలో రెండో సారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘మా లక్ష్యం 175 సీట్లకు చేరువగా వస్తున్నాం. రాజకీయాల్లో జగన్ ట్రెండ్ సెట్ చేశారు. ఓడిపోతామనే అసహనంతో టీడీపీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. మా నేత పిలుపునిస్తే.. ఒక నిమిషంలో అంతా మారిపోతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 10, 2026

విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

image

AP: విశాఖ మెట్రోకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. CM చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోకి అనుమతి ఇవ్వాలనే CM అభ్యర్థన మేరకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత మెట్రోకి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడే అవకాశముంది.

News February 10, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్ 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in

News February 10, 2026

కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

image

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.