News May 16, 2024
కరీనా టాటూ తొలగించిన సైఫ్..

నటుడు సైఫ్ అలీఖాన్ టాటూ వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. గతంలో తన భార్య కరీనా కపూర్ పేరును చేతిపై టాటూ వేయించుకున్న సైఫ్.. తాజాగా దాన్ని తొలగించారు. ఆ స్థానంలో త్రిశూలం టాటూ కనిపించింది. ఎయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా టాటూను దాచే ప్రయత్నం చేశారు. దీంతో వీరు విడిపోతున్నారేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2012లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News February 12, 2026
అరవ శ్రీధర్ రావట్లేదా?.. అసెంబ్లీ లాబీలో చర్చ

AP: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు <<19038842>>ఎదుర్కొంటున్న<<>> రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ గురించే ఇవాళ అసెంబ్లీ లాబీలో ఎక్కువసేపు చర్చ సాగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ అసెంబ్లీకి రావట్లేదా? అంటూ మిగతా ఎమ్మెల్యేలు చర్చించుకున్నారట. అయితే ఈ సెషన్ మొత్తానికి ఆయన్ను రావద్దని జనసేన అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. అటు బయట పార్టీ కార్యక్రమాల్లోనూ శ్రీధర్ కనిపించడం లేదు.
News February 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లో పరిమితి లేని వైద్య సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పేలో 1.5%, సర్కార్ 1.5% కలిపి మొత్తం 3%(ఏటా సుమారు రూ.1000Cr) కేటాయించనుంది. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఇందులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీనికోసం కమిటీని ఏర్పాటు చేయనుంది.
News February 12, 2026
ఈ 3 ఆహారాలు.. ‘లివర్’ కిల్లర్స్

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో <<19090434>>లివర్<<>> ఒకటి. దాన్ని ఈ 3 రకాల ఫుడ్స్ నాశనం చేస్తాయంటున్నారు వైద్యులు.
షుగర్ డ్రింక్స్: సోడాస్, ఫ్రూట్ జూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్.. లివర్‌కు విషం లాంటివి.
డీప్ ఫ్రైడ్ ఫుడ్: ఇలాంటి ఆహారం తింటే లివర్ సెల్స్ డ్యామేజీ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు పెరుగుతుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్: చిప్స్, క్యాండీస్, హాట్ డాగ్స్, న్యూడుల్స్.. సీరియల్ కిల్లర్స్ లాంటివి.
#Shareit


