News May 16, 2024

అదానీ పోర్ట్స్‌కు నార్వే షాక్!

image

ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌కు అర్హులైన సంస్థల జాబితా నుంచి అదానీ పోర్ట్స్‌ను తొలగిస్తున్నట్లు నార్వే సెంట్రల్ బ్యాంక్ నార్గెస్ వెల్లడించింది. అదానీతో పాటు యూఎస్‌కు చెందిన ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్, చైనాకు చెందిన వీచాయ్ పవర్‌ను కూడా తొలగించింది. 2022 నుంచి ఈ సంస్థపై నిఘా పెట్టామని తెలిపింది. యుద్ధం, సంక్షోభాలను ఎదుర్కొనే ప్రాంతాల్లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలతో ఈ సంస్థకు సంబంధం ఉందని పేర్కొంది.

Similar News

News February 11, 2026

800లకు ఒక్క మార్కు.. అయినా MS ఆర్థోపెడిక్స్ సీటు!

image

NEET PGలో 800 మార్కులకు గానూ కేవలం ఒక్క మార్కు సాధించిన అభ్యర్థికి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో MS ఆర్థోపెడిక్స్ సీటు లభించింది. కటాఫ్ పర్సంటైల్‌ను సున్నాకు తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన 20 మందికి ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో సీట్లు దక్కాయి. టాప్ ర్యాంకర్లు ఎంచుకునే కోర్సులు సైతం 100లోపు మార్కులు వచ్చినవారికి దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

News February 11, 2026

తమిళనాడులో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు: స్టాలిన్

image

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని DMK అధినేత, సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2021 కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేస్తామని తెలిపారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో తనకు సోదర బంధం ఉందని పేర్కొన్నారు. అధికారాన్ని పంచుకోవడమనే ప్రశ్న ఇప్పుడు ముఖ్యం కాదన్నట్లుగా మాట్లాడారు.

News February 11, 2026

సల్మాన్ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటుంది: ఏక్‌నాథ్ షిండే

image

RSS శతాబ్ది వేడుకలకు నటుడు సల్మాన్ ఖాన్ హాజరవడంపై వస్తున్న విమర్శలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తిప్పికొట్టారు. సల్మాన్ భారతీయ పౌరుడని, మన సంస్కృతిని గౌరవిస్తారని గుర్తుచేశారు. ఆయన ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ఒక కార్యక్రమానికి హాజరైనంత మాత్రాన వివాదం చేయడం సరికాదన్నారు. ఆయన దేశభక్తిని, సంస్కృతిని గౌరవించే తత్వాన్ని చూడాలని సూచించారు.