News May 16, 2024

ఒక్కో చెట్టు నరికినందుకు 100 మొక్కలు నాటాలి: సుప్రీంకోర్టు

image

ఆరావళి శ్రేణుల్లో మైనింగ్ అనుమతులు ఇవ్వొద్దని తాము ఆదేశించినా ఢిల్లీలో 458 చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మండిపడింది. రోడ్డు విస్తరణ కోసం ఈ పనిచేసిన ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌ సుభాషిశ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధమైంది. ఒక్కో చెట్టు నరికినందుకు 100 మొక్కలు నాటాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించాయి.

Similar News

News January 28, 2026

వంటింటి చిట్కాలు మీకోసం

image

* నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్‌లో ఉంచితే మరో 2 రోజులు వాడుకోవచ్చు. * నీళ్ళలో పచ్చిపాలు కలిపి వెండి సామగ్రి కడిగితే మురికి వదిలిపోయి శుభ్రపడతాయి. * బెండకాయ కూరలో కాస్త పెరుగు/ నిమ్మరసం జోడిస్తే జిగురు రాకుండా ఉంటుంది. * పిండిలో పావుకప్పు వేయించిన సేమియా వేస్తే గారెలు మరింత రుచిగా ఉంటాయి. *అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.

News January 28, 2026

నాకేమీ మతిమరుపు లేదు: ట్రంప్

image

ఇటీవల చేతికి గాయంతో <<18941717>>కనిపించిన<<>> US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తడబడ్డారు. తన కుటుంబ ఆరోగ్య చరిత్రను చెబుతూ ‘అల్జీమర్స్’ పేరును మరచిపోయారు. ‘నా తండ్రికి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఆ ఒక్కటి తప్ప. అదేంటి’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌ను అడిగారు. అల్జీమర్స్ అని ఆమె బదులివ్వడంతో ‘అది నాకు లేదు. నా ఆరోగ్యం చాలా బాగుంది. వంశపారంపర్యంగా వస్తుందనే ఆందోళన కూడా లేదు’ అని చెప్పారు.

News January 28, 2026

బాబాయ్‌తో విభేదించి.. పార్టీని చీల్చి..

image

తన బాబాయ్, NCP అధినేత శరద్ పవార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 NOVలో అజిత్ పవార్ BJPతో కలిశారు. ఫడణవీస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, Dy.CMగా ప్రమాణం చేశారు. కానీ వారానికే సొంతగూటికి చేరారు. 2023 జులైలో మరోసారి తన వర్గంతో వెళ్లి BJPతో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం, పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. మూడేళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో <<18701129>>బాబాయ్, అబ్బాయ్<<>> ఒక్కటయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగింది.