News May 16, 2024
రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

AP: రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘వైజాగ్‌లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ‘సహస్రార చక్రం’

తల పైభాగంలో ఉండే ఈ చక్రం ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం. ఇది సమతుల్యంగా ఉంటే విశ్వంతో సంబంధం ఏర్పడి, అపారమైన జ్ఞానం, ఆనందం కలుగుతాయి. అస్థిరత ఏర్పడితే మానసిక ఒత్తిడి, జీవితంపై విరక్తి, ఒంటరితనం వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి మౌన ధ్యానం శ్రేష్ఠమైనది. తల పైభాగంలో వెలుగు ఉన్నట్లు ఊహిస్తూ ధ్యానం చేయడం ఓంకారాన్ని పలకడం ద్వారా ఈ చక్రాన్ని సమతుల్యం చేయవచ్చు. ఇది మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది.
News February 4, 2026
వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

కొన్నిచోట్ల వరి పంటలో మానిపండు తెగులు కనిపిస్తోంది. దీన్ని కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News February 4, 2026
CSIRలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్& ఇండస్ట్రియల్ రీసెర్చ్(<


