News May 16, 2024

FY25లో విమాన ప్రయాణికులు 418 మిలియన్లు: ఇక్రా

image

దేశంలో 2023-24లో విమాన ప్రయాణికుల సంఖ్య 376.4 మిలియన్లకు చేరిందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ వెల్లడించింది. 2024-25లో ఆ సంఖ్య 8-11% వృద్ధితో 407-418 మిలియన్లకు చేరొచ్చని అంచనా వేసింది. దేశీయంగా కొత్త గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడం, అంతర్జాతీయ ప్రయాణాల్లో పెరుగుదల కలిసొస్తుందని పేర్కొంది. గ్లోబల్ ప్యాసింజర్ ట్రాఫిక్ 2019లో 3.8 శాతం ఉండగా, 2023లో 4.2 శాతానికి చేరిందని తెలిపింది.

Similar News

News January 11, 2025

గాయంతో హీరోయిన్ రష్మిక(PHOTOS)

image

జిమ్‌లో గాయపడ్డ హీరోయిన్ రష్మిక తాజా ఫొటోలను పంచుకున్నారు. ‘కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్‌లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. ఆలస్యానికి నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా తిరిగొచ్చి యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తాను’ అని ఆమె పోస్ట్ పెట్టారు.

News January 11, 2025

విద్యార్థులకు శుభవార్త: లోకేశ్

image

AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.

News January 11, 2025

భారత్-ఇంగ్లండ్ T20 సిరీస్ షెడ్యూల్

image

☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.