News May 16, 2024
SCBA ప్రెసిడెంట్‌గా కపిల్ సిబల్

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(SCBA) అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఆయనకు 1,066 ఓట్లు రాగా, మరో అడ్వొకేట్ ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు, అదిష్ అగర్వలాకు 296 ఓట్లు వచ్చాయి. ఫైనల్ ఓట్లు అధికారికంగా వెలువడాల్సి ఉంది. సిబల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం ఇది నాలుగోసారి. 1995-96, 1997-98, 2000-01లో పనిచేశారు. ఈయన ప్రస్తుతం యూపీ నుంచి(సమాజ్‌వాదీ పార్టీ) రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
Similar News
News February 11, 2026
CMETలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(CMET) 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/MSc/ME/MTech/PhD, MBA/PGDM/MMS/MCom, BCom, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cmet.gov.in
News February 11, 2026
నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ సాధ్యమేనా?

ప్రసవ సమయంలో మహిళలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. అయితే నార్మల్ డెలివరీలోనూ నొప్పిలేకుండా డెలివరీ చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. నొప్పులు మొదలై గర్భాశయ ముఖద్వారం కనీసం 4సెంటీమీటర్లు తెరుచుకున్నాక మత్తు డాక్టర్ సాయంతో ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా ఇస్తారు. దీనివల్ల సంకోచ వ్యాకోచాలకు ఇబ్బంది ఉండదు. ఏవైనా కాంప్లికేషన్లు వచ్చి నార్మల్ డెలివరీ కాకపోతే వెంటనే సిజేరియన్ చేయొచ్చని సూచిస్తున్నారు.
News February 11, 2026
అరటిలో కాయ ముచ్చిక కుళ్లు తెగులు- నివారణ

ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలను ఎక్కువగా ఆశిస్తుంది. కాయల చివర ముచ్చిక వద్ద నల్లగామాడిన కుళ్లు మచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనబడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనిపించి క్రమేపీ చాలా కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు గెలలు పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


