News May 17, 2024

కడప: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చిమిరపకాయల ధర ఒక్కసారిగా 70 రూపాయలకు చేరింది. అల్లం ధర రూ.170 పలుకుతోంది. బీన్స్ కిలో రూ.75 పలుకుతోంది. క్యాప్సికం, కాకర కిలో రూ.60, బీరకాయ, అలసంద కాయలు కిలో రూ.55 పలుకుతున్నాయి. టమోటా, వంకాయలు మాత్రమే కిలో రూ.20 ఉండగా మిగిలిన కూరగాయల ధరలన్నీ భారీగా పెరిగాయి.

Similar News

News September 10, 2025

కడప: కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్‌లో ఉన్న ఏపీ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News September 10, 2025

కడప జిల్లా పోలీసు శాఖకు నూతన జాగీలం

image

జిల్లా పోలీసు శాఖకు నూతన జాగిలం సోనును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం నూతన జాగీలాన్ని పరిశీలించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ జాగీలం వచ్చిందని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధన, పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిందన్నారు. బిల్జియం మల నాయిస్ జాతికి చెందిన జాగీలమని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచనలు చేశారు.

News September 10, 2025

కడప జిల్లాలో పలువురు పోలీస్ సిబ్బంది బదిలీ

image

కడప జిల్లాలో 44 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తక్షణం ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మరో 11 మంది సిబ్బందిని వివిధ చోట్ల అటాచ్ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు ASIలు, HCలు, PCలు, WPCలు ఉన్నారు.