News May 17, 2024
ఉమ్మడి జిల్లాలో 2 నగరాల్లో ఓటర్లలో చైతన్యం
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని రెండు నగరాల్లో ఓటర్ల చైతన్యంలో కాకినాడ ప్రథమ స్థానంలో నిలిచింది. కాకినాడలో అత్యధికంగా 72.16% పోలింగ్ జరిగింది. రాజమహేంద్రవరంలో 67.57% పోలింగ్ నమోదైంది. ఈ రెండు నగరాల్లో ఓటింగ్ శాతం గతం కంటే పెరిగింది. మరోవైపు 9 పట్టణాల్లో మండపేట, పిఠాపురం, నిడదవోలు ముందంజలో నిలిచాయి. మండపేటలో అధికంగా 85.72%, పిఠాపురంలో 83.48%, నిడదవోలులో 82.31% పోలింగ్ జరిగింది.
Similar News
News November 25, 2024
రాజమండ్రిలో వ్యభిచారం.. యువతుల అరెస్ట్
స్పా సెంటర్ మాటున వ్యభిచారం చేయడం రాజమండ్రిలో కలకలం రేపింది. తాడితోటలో సతీశ్, లక్ష్మి బ్యూటీ సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. అక్కడ మసాజ్ చేస్తున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.
News November 25, 2024
రేపు యథావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్ ప్రశాంతి
సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండలస్థాయిలో అధికారులు తీసుకుని త్వరతగతిన పరిష్కారిస్తారని ఆమె తెలిపారు.
News November 24, 2024
కోనసీమ వాసికి అవార్డు అందించిన సినీ నటి కీర్తి సురేశ్
ఉమ్మడి తూ.గో.జిల్లా పి.గన్నవరంలో రెండున్నర దశాబ్దాల నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీగా సభ్యులకు సేవలు అందిస్తున్నందుకు ధనవర్ష సొసైటీకి ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ అవార్డు అందించారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో శనివారం జరిగిన సమావేశంలో అవార్డు అందించారని సంగం ఛైర్మన్ కంకిపాటి ప్రసాద్ ఆదివారం తెలిపారు.