News May 17, 2024
APLకు సెలక్ట్ అయిన సింగరాయకొండ బిడ్డ

ఐపీఎల్ తరహాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు సింగరాయకొండ యువకుడు సెలక్ట్ అయ్యాడు. గురువారం వైజాగ్‌లో ఏపీఎల్ వారు నిర్వహించిన వేలంలో మన సింగరాయకొండ చెందిన చెమట సురేంద్ర కృష్ణ గోదావరి టీమ్‌కు సెలక్ట్ అయ్యాడు. ఏపీఎల్ మ్యాచ్‌లు వైజాగ్‌లో వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
Similar News
News January 7, 2026
రామాయపట్నం పోర్టు పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష

గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రస్తుత పనుల పురోగతి, భూసేకరణ స్థితిగతులపై ఆరా తీశారు. డ్రెడ్జింగ్, బెర్త్ వర్క్స్, ఆన్‌షోర్ వర్క్స్, రైల్వే లైన్ నిర్మాణం, రోడ్డు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు.
News January 7, 2026
మార్కాపురం: హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఇతనే.!

మార్కాపురం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.
News January 7, 2026
కనిగిరి హత్య కేసులో మరో ట్విస్ట్.!

వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లిలో మహిళను చంపి, ఆపై AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం క్లూస్‌టీం రంగంలోకి దిగింది. సీనావలి, నాగజ్యోతి మృతదేహాలకు కనిగిరి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. జ్యోతి మృతదేహాన్ని కట్టకిందపల్లికి తరలించేందుకు యత్నించగా మృతురాలి బందువులు న్యాయం చేయాలని పోలీసులను నిలదీశారు. వీరిరువురి మృతిపై <<18773256>>మూడవ వ్యక్తి ప్రమేయం<<>> ఉందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు.


