News May 17, 2024

నంబర్ ప్లేట్ లేకుంటే బైక్ సీజ్

image

TG: నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయాలని HYD పోలీసులు నిర్ణయించారు. నిన్న ఒక్కరోజే 20కి పైగా బైక్‌లను జప్తు చేశారు. కొత్త నంబర్ ప్లేట్ బిగించిన తర్వాతే వాటిని తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల HYDలో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు CC కెమెరాలను పరిశీలించగా.. వారు ఉపయోగించిన బండ్లకు నంబర్ ప్లేట్లు లేవు. దీంతో అలాంటి వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు.

Similar News

News January 10, 2025

జనవరి 10: చరిత్రలో ఈరోజు

image

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు.
* 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్
* 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు(ఫొటోలో)
* 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు.

News January 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 10, 2025

డైరెక్షన్ చేయడం తప్పుడు నిర్ణయం: క‌ంగ‌న‌

image

పొలిటికల్ డ్రామాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని నటి కంగ‌న పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌డం కూడా స‌రైంది కాద‌ని భావించాన‌ని, సెన్సార్ అవ‌స‌రం లేకుండా OTTలో మంచి డీల్ దక్కేదనుకున్న‌ట్టు చెప్పారు. CBFC స‌ర్టిఫికెట్ నిలిపివేయడంతో భయపడ్డానని, NDA ప్ర‌భుత్వం ఉండ‌డం వ‌ల్ల త‌న చిత్రానికి ఏమీ కాద‌ని భావించానని పేర్కొన్నారు. Jan 17న చిత్రం విడుదల కానుంది.