News May 17, 2024

మమతా మీ రేటెంత? అని అడిగిన BJP నేత

image

CM మమతా బెనర్జీపై మాజీ జడ్జీ, BJP నేత అభిజిత్ గంగోపాధ్యాయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నా‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభిజిత్ ‘సందేశ్‌ఖాలీ BJP అభ్యర్థి రేఖా పాత్రను రూ.2000కి కొనుగోలు చేశామని తృణమూల్ అంటోంది. మమతా బెనర్జీ.. మరి మీ రేటెంత? రూ.10 లక్షలా?’ అని వ్యాఖ్యానించారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన TMC.. ఆయన హద్దులు మీరారంటూ ECకి ఫిర్యాదు చేసింది.

Similar News

News January 10, 2025

జనవరి 10: చరిత్రలో ఈరోజు

image

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు.
* 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్
* 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు(ఫొటోలో)
* 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు.

News January 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 10, 2025

డైరెక్షన్ చేయడం తప్పుడు నిర్ణయం: క‌ంగ‌న‌

image

పొలిటికల్ డ్రామాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని నటి కంగ‌న పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌డం కూడా స‌రైంది కాద‌ని భావించాన‌ని, సెన్సార్ అవ‌స‌రం లేకుండా OTTలో మంచి డీల్ దక్కేదనుకున్న‌ట్టు చెప్పారు. CBFC స‌ర్టిఫికెట్ నిలిపివేయడంతో భయపడ్డానని, NDA ప్ర‌భుత్వం ఉండ‌డం వ‌ల్ల త‌న చిత్రానికి ఏమీ కాద‌ని భావించానని పేర్కొన్నారు. Jan 17న చిత్రం విడుదల కానుంది.