News May 17, 2024
HYD: రూ.50 కోసం గొడవ.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మద్యం తాగేందుకు రూ.50 కోసం గొడవ పడి గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. అల్వాల్ పోలీసుల వివరాలు.. మచ్చబొల్లారంలో నివాసముండే సురేశ్(45) పెయింటింగ్ పని చేస్తున్నాడు. సూర్యనగర్‌లో నివాసముండే భరత్‌ను 13న మద్యానికి డబ్బులు లేవని రూ.50 ఇవ్వాలని అడిగాడు.దీంతో తరచూ ఎందుకు అడుగుతున్నావని భరత్ గొడవకు దిగాడు. మాటమాట పెరిగి భరత్ సురేశ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సురేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.
Similar News
News January 15, 2025
జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.
News January 15, 2025
త్వరలో OUలో ఇంజినీరింగ్ కోర్సులు
ఉన్నత విద్యా మండలి, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ఆమోదంతో త్వరలో ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఓయూ అధికారులు తెలిపారు. ఉపాధి కల్పన, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పించేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కోర్సుల్లో ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థల తరహాలో పాఠ్యాంశాలను రూపొందించనున్నాయి.
News January 15, 2025
HYD: నుమాయిష్‌లో పోలీసుల బందోబస్తు
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.